Header Banner

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..! మరోసారి భారీగా తగ్గిన ధరలు!

  Thu May 15, 2025 18:17        Business

భారతదేశంలో బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఈ తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించిన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,375 తగ్గి, రూ.93,859 నుంచి రూ.91,484కు చేరుకుంది. ఇదే తరహాలో, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.85,975 నుంచి రూ.83,799కు దిగివచ్చింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.70,394 నుంచి రూ.68,613కు తగ్గింది.

కేవలం కొన్ని వారాల క్రితం, ఏప్రిల్ 22న... 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు లక్ష రూపాయల మార్కుకు చేరువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆకస్మిక తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఆశాజనకంగా మారింది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,297 తగ్గి, రూ.96,400 నుంచి రూ.94,103కు పడిపోయింది.

ఈ పతనం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో జూన్ 5 నాటి గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి రూ.91,325 వద్ద ట్రేడవ్వగా, జూలై 4 నాటి సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు అంతే మొత్తంలో తగ్గి రూ.94,458 వద్ద ట్రేడయ్యాయి.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GoldPriceDrop #GoldRates #SilverPrices #GoldNews #BullionUpdate #IndianMarkets #GoldBuyers #GoldRateToday